Take a fresh look at your lifestyle.

నాగోల్ రోడ్డుపై ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం

0

 

నాగోల్ రోడ్డుపై ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం

నాగోల్ వెళ్లే ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ నుంచి నాగోల్‌కు వెళ్లే మార్గంలో ఉన్న హరిపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్చ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారం ప్రకారం, కొలిశెట్టి కృష్ణయ్య అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులో కొంత భాగంలో షట్టర్ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని చెబుతున్నారు. గతంలోనే GHMC అధికారులు అక్రమ నిర్మాణంపై నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణం కొనసాగినట్లు సమాచారం.ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న తన వ్యక్తిగత ప్లాట్ డాక్యుమెంట్లను చూపిస్తూ అధికారులను తప్పుదోవ పట్టించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్ నెంబర్ 6903/2006 ప్రకారం కృష్ణయ్య ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేసి వాటిని వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ప్రభుత్వ భూమిని పూర్తిగా ఆక్రమించుకునే ఉద్దేశంతో తప్పుడు పత్రాలను ఉపయోగించి షట్టర్ నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ నిర్మాణానికి GHMC వద్ద హౌస్ నెంబర్ కోసం కూడా దరఖాస్తు చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.